News

ప్రశాంతంగా బ‌క్రీద్ వేడుక‌లు జరుపుకున్న జ‌మ్మూక‌శ్మీర్‌ ప్రజలు

104views

జ‌మ్మూక‌శ్మీర్‌లో బ‌క్రీద్ వేడుక‌లను ముస్లింలు ప్ర‌శాంతంగా జ‌రుపుకుంటున్నారు. క‌శ్మీర్ లోయ‌తో పాటు వివిధ న‌గ‌రాల్లో ముస్లింలు ప్రార్థ‌న‌లు చేశారు. రాచౌరీలో మ‌సీదులో వంద‌లాది మంది న‌మాజ్ చేశారు. జ‌మ్మూలోని ఈద్గాలో సుమారు 5వేల మంది న‌మాజ్ చేశారు. బారాముల్లా, రంబన్, అనంతనాగ్, షోపియాన్, అవంతిపోరా, శ్రీనగర్ లలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది. శ్రీనగర్ పోలీసులు స్థానికులకు స్వీట్స్ పంచారు. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేయ‌డంతో జ‌నం ఎక్కువ‌గా వీధుల్లోకి రావ‌డం లేదు.

నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ శ్రీనగర్ కు చేరుకున్నారు. లాల్ చౌక్ లో కూడా ఆయన అడుగుపెట్టారు. శ్రీనగర్ లోని సౌరా, పాంపోర్, లాల్ చౌక్, హజ్రత్ బల్ ప్రాంతాల్లోని పరిస్థితులను సమీక్షించారు. అలాగే ఈద్ కు సంబంధించిన ఏర్పాట్లను కూడా ఆయన అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్టికల్ 370 ని రద్దు చేశాక అక్కడి పరిస్థితిని అజిత్ దోవల్ మొదటి నుండి సమీక్షిస్తున్నారు. సైన్యాన్ని మోహరించడం.. భద్రతా దళాలను అలర్ట్ చేయడం మొత్తం అజిత్ దోవల్ కనుసన్నులలో జరుగుతున్నట్లు సమాచారం.