
323views
సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో తొలి విడత చందనం అరగదీత శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు తొలి చందనం చెక్కకు అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధానా ర్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు తొలి చందనాన్ని అరగదీశారు. అనంతరం ఇరవై మంది నాల్గవ తరగతి సిబ్బంది చందనం అరగదీత పనిలో నిమగ్నమయ్యారు. ఈ నెల 10న వైశాఖ శుద్ధ తదియను పురస్కరించుకుని జరిగే చందనోత్సవం సందర్భంగా ఆ రోజు స్వామివారి నిజ రూపదర్శనం అనంతరం రాత్రి తొలి విడతగా సమర్పించే మూడు మణుగుల పచ్చి చందనాన్ని(120 కిలోలు) సిద్ధం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేప ట్టారు. ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు





