
303views
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శుక్రవారం పురుషోత్తముడి పుష్పాభిషేకం నేత్రపర్వంగా సాగింది. శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను తొమ్మిది రోజుల పాటు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి పాంచరాత్ర ఆగమ శాస్త్రం అనుసరించి స్వామికి పుష్పాభిషేకం క్రతువును నయనానందకరంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ జగదభిరాముడికి సుమారు 2 టన్నుల సుగంధభరిత పుష్పాలను సమర్పించారు. అనంతరం సీతారాముల ఏకాంత సేవ జరిగింది. పుష్పాభిషేకానికి వినియోగించిన పువ్వుల కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు పోటీపడ్డారు. ఉత్సవాల్లో తితిదే అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.





