
దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో రూ.5కోట్లతో నూతనంగా నిర్మించిన యాగశాలను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. దేవదాయశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ కరికాల వలవన్, కమిషనర్ సత్యనారాయణ, ఈవో కేఎస్ రామారావు, ఆలయ వైదిక కమిటీ సభ్యులు, స్థానాచార్యులు, ముఖ్య అర్చకులు, ఈఈలు పాల్గొన్నారు. వేదమంత్రాలు, మంగళోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య యాగశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గణపతి హోమం, ల క్ష్మీహోమం, వాస్తు హోమం, గోపూజ నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న యాగశాల ఇరుకుగా ఉండడంతో దాత సంగా నరసింహారావు అందజేసిన రూ.5కోట్ల భారీ విరాళంతో దీన్ని నిర్మించారు.
ఈ సందర్భంగా ఈవో రామారావు మాట్లాడుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే యాగశాలకు శంకుస్థాపన జరిగిందని అనతికాలంలో నే యాగశాల భక్తులకు అందుబాటులోకి రావడం ముదావహమన్నారు. విస్తరించిన యాగశాల అవసరమని చాలాకాలంగా ప్రతిపాదనలో ఉందని అయితే దాత సంగా నరసింహారావు ముందుకొచ్చి విరాళం ప్రకటించి ఆయనే స్వయంగా దగ్గరుండి నిర్మింపజేశారని, ఐఐటీ మద్రాస్, ముంబాయి నుంచి నిపుణులను రప్పించి ఆగమ విహీతంగా ఎక్కడా లోటుపాట్లు లే కుండా సాంకేతిక విధానాన్ని వినియోగించి నిర్మింపజేశారని ఇందుకు భారీ క్రెయిన్లను వినియోగించారన్నా రు. దేవస్థానం తరఫున దాత నరసింహరావుకు అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఇదే సమయంలో అంతరించిపోతున్న ఒక గ్రంథాన్ని సంగా నరసింహరావు ముద్రింపజేస్తున్నారని ‘అపౌరుషేయ మహా భగవాత’ గ్రంథాన్ని మళ్లీ తనముందుకు తె చ్చేందుకు ఆయన సహకరిస్తున్నారన్నారు. ఈ గ్రంథాన్ని కూడా ఈరోజునే ఆవిష్కరించామని, పరిశోధకులు లక్ష్మీధర శర్మ దీన్ని రచించారన్నారు. అనంతరం లక్ష్మీధర శర్మ మాట్లాడుతూ అమ్మవారి సంపూర్ణ స్వరూ పం ఈ గ్రంథం ఉంటుందన్నారు.




