News

రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం

229views

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి వీక్షించారు. కల్యాణానికి గరుత్మంతుడు అతిథిగా వస్తారని భక్తుల నమ్మిక. ఈ క్రమంలో గరుడ పక్షి రెండు సార్లు ఆలయ గాలి గోపురం చుట్టూ ప్రదక్షిణలు చేసింది. ఈ దివ్య ఘట్టాన్ని తిలకించిన భక్తులు గోవింద నామ స్మరణ చేశారు.

కనులపండువగా తెప్పోత్సవం
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవాన్ని గురువారం కనులపండువగా నిర్వహించారు. ప్రత్యేకంగా తయారు చేసిన తెప్పపై శ్రీదేవి, భూదేవి సమేత రంగనాయకస్వామిని కొలువుదీర్చి నెమలిగుండంలో విహరించారు. భక్తులు తిలకించి పులకించారు.