News

భారత భూభాగంలోకి పాక్ ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు – తిప్పికొట్టిన భారత ఆర్మీ

107views

క వైపు భారత్లోని ఆర్టికల్ 370 ఎత్తివేత, జమ్మూ కాశ్మీర్ విభజన విషయమై అధికార విపక్షాల మధ్య పార్లమెంట్ వేదికగా తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్న వేళ గుట్టు చప్పుడు కాకుండా గట్టు దాటి భారత భూభాగంలోకి చొరబడ్డానికి ఉగ్రవాదులు ప్రయత్నించారు. భారత భూభాగంలోకి అర కిలోమీటర్ మేర అక్రమంగా చొరబడ్డ ఆరుగురు ఉగ్రవాదులు సరిహద్దుల్లో పహరా కాస్తున్న భారత జవానుపై కాల్పులు జరిపడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. దీనికి ప్రతిగా భారత జవాన్లు ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు జరపడంతో పరారయ్యారు.

మంగళవారం తెల్లవారు ఝామున 2.30 గంటల సమయంలో జమ్మూ కాశ్మీర్లోని మచ్చల్ సెక్టార్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు భారత సైన్యాధికారులు స్పష్టం చేశారు. ఉగ్రవాదులు పాక్ భూభాగం నుంచి భారత్ భూభాగంలోకి అక్రమ చొరబాటుకి యత్నించటం వారం వ్యవధిలో ఇది రెండవ సారి. రెండు మూడు రోజులకు ముందు జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లా కీరన్ సెక్టార్లో ఐదారుగురు ఉగ్రవాదులు అక్రమ చొరబాటుకి యత్నించగా వారిని మన సైనికులు కాల్చి చంపిన సంగతి విదితమే.