
విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నూతన యాగ శాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అత్యంత అద్భుతంగా, సర్వాంగ సుంద రంగా రూపుదిద్దుకుంటున్న ఈ యాగశాలను ఈ నెల 26వ తేదీన ప్రారంభించేందుకు దేవస్థాన అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రారంభోత్సవానికి మరో పది రోజుల గడువే ఉండటంతో నిర్మాణ పనులను కార్మికులు మరింత ముమ్మరం చేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాధాకృష్ణ విగ్రహం సమీపంలోని పాత లడ్డూ ప్రసాదం పోటు స్థలంలో నూతన యాగశాల నిర్మాణం జరుగుతోంది. ఈ యాగశాల నిర్మా ణంతో చండీహోమం జరిపించుకునే భక్తులకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి. యాగశాలను రూ.5 కోట్లతో దాత సంగా నరసింహారావు నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులపై ఆలయ ఈఓ కె.ఎస్. రామరావు ప్రత్యేక దృష్టి సారించారు. నితంతరం ఆలయ ఇంజినీరింగ్, అధికారులు, స్థపతితో చర్చించి పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.
తీరనున్న భక్తుల ఇక్కట్లు
అమ్మవారి సన్నిధిలో నిత్యం చండీహోమం నిర్వహిస్తారు. సాధారణ రోజుల్లో సుమారు 50 మంది ఉభయదాతలు, అమావాస్య, పౌర్ణమి, దశమి, ఏకాదశి, ఇతర విశేష పర్వదినాల్లో 250 మందికి పైగా ఈ హోమంలో పాల్గొంటారు. ప్రస్తుతం మల్లేశ్వర స్వామి ఆలయానికి చేరుకునే మార్గమధ్య లోని యాగశాలలో చండీహోమం జరుగుతోంది. విశేష పర్వదినాల్లో చండీహోమం జరిపించుకునే ఉభయదాతలు యాగశాలలో కూర్చునే వీలు ఉండటంలేదు. దీంతో వారు ఆరు బయట మెట్లపై కూర్చోవాల్సి వస్తోంది. నూతన యాగశాలను 250 గజాల స్థలంలో నిర్మిస్తున్నారు. 300 మందికి పైగా ప్రత్యక్షంగా యాగాన్ని వీక్షించేలా యాగశాల నిర్మాణం జరుగుతోంది. యాగశాల చుట్టూ మరో ఆరు అడుగుల వెడల్పున వరండా నిర్మిస్తున్నారు. ఒక వేళ పర్వదినాల్లో అనుకున్న సంఖ్య కంటే అత్యధికంగా ఉభయదాతలు చండీహోమంలో పాల్గొంటే వారు వరండాలో కూర్చుని యాగాన్ని వీక్షించే అవకాశం ఉంటుంది. యాగశాల నిర్మాణ పనులను ఈఓ కె.ఎస్.రామరావు ప్రతి మూడు రోజులకు ఒక సారి పర్యవేక్షిస్తున్నారు.
యాగశాల విశేషాలు ఇవీ..





