News

లక్షద్వీప్‌కు పెరిగిన పర్యాటకుల సంఖ్య

246views

లక్షద్వీప్ దీవులను సందర్శించిన పర్యటకుల సంఖ్య పెరిగిందని అక్కడి పర్యటకశాఖ అధికారి ఇంతియాస్ మహ్మద్ టిబి తెలిపారు. అంతర్జాతీయ, విదేశీ పర్యటకులు ఈ ద్వీపాన్ని సందర్శించడానికి ప్యాకేజీల కోసం తమను సంప్రదిస్తున్నారని, ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున శోధిస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో లక్షద్వీప్ మరిన్ని క్రూయిజ్ షిప్ కంపెనీలను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుందని తెలిపారు. లక్షద్వీప్‌కు వాయు రవాణాను మెరుగుపరచడం వల్ల పర్యటకులను ఆకర్షించే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆయన ఆశించారు.

ఇదిలా ఉండగా ముంబైకి చెందిన ఒక పర్యటకుడు అమన్ సింగ్ మాట్లాడుతూ ‘‘మేము చాలా కాలంగా లక్షద్వీప్‌కు రావాలనుకుంటున్నాము. అయితే ఈ ద్వీపానికి సంబంధించి కొన్ని అపోహలు ఉండడంతో రాలేకపోయాము. ప్రధాని పర్యటన అనంతరం ఇక్కడికి రావడం కష్టమేమీ కాదనిపించింది.’’ అని అన్నారు. ఢిల్లీకి చెందిన మరో యాత్రికుడు సుమిత్ ఆనంద్ మాట్లాడుతూ, తనకు లక్షద్వీప్‌కు రావాలనే కోరిక ఎప్పుడూ ఉండేదని, అయితే ప్రధాని మోదీ ఫొటోలు, వీడియోలను చూసిన తర్వాత కచ్చితంగా ఈ ప్రాంతాన్ని చూడాలని నిశ్చయించుకున్నానని తెలిపారు.