
233views
తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. ములుగు జిల్లా కర్రిగుట్టలు-చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ పరిధిలోని పోలీసులు కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చింది. ఎన్‌కౌంటర్ అనంతరం అటవీప్రాంతంలో గాలించగా ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. ఏకే 47తోపాటు మూడు తుపాకులు, ఇతర పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 13 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు





