News

సింహాచలేశుడి కళ్యాణోత్సవం, చందనోత్సవం ఎప్పుడంటే…?

187views

శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి కొలువైన సింహాచలం ఆలయం, స్వామివారి వార్షిక కళ్యాణోత్సవానికి ముస్తాబవుతోంది. ఏప్రిల్ 19న స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపిన ఆలయ అధికారులు, మే 10న చందనోత్సవం ఉంటుందన్నారు. ఫాల్గుణ ఏకాదశిరోజున వార్షిక కళ్యాణోత్సవం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఏప్రిల్ 19న రాత్రి 8 గంటలకు రథోత్సవం రంగరంగ వైభవంగా జరగనుంది. ఈ ఏడాది కూడా చందనోత్సవం సందర్భంగా స్వామి నిజరూప దర్శనానికి లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లలో ఆలయ అధికారులు నిమగ్నమయ్యారు. కళ్యాణోత్సవం, చందనోత్సవం ఏర్పాట్లపై సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాస మూర్తి, సమీక్ష నిర్వహించారు. అర్చకుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు.