
219views
అయోధ్య రామ మందిరాన్ని నిర్మించుకున్న శుభ సందర్భంగా శ్రీరామనవమి రోజున దేశవ్యాప్తంగా నిర్వహించే బైక్ ర్యాలీలో భక్తులు పాల్గొని శ్రీరామ యాత్రను జయప్రదం చేయాలని శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి పిలుపునిచ్చారు.విజయవాడ సత్యనారాయణపురంలోని ఆంజనేయ స్వామి గుడిలో ఆయన ప్రత్యేక పూజలు చేసి బైక్ ర్యాలీ స్టిక్కర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివస్వామి మాట్లాడుతూ ఈనెల 17న శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం 4 గంటలకు బైక్ ర్యాలీ సత్యనారాయణపురంలోని శ్రీరామకోటి నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు.





