
239views
శంషాబాద్ నుంచి అయోధ్యకు విమాన సర్వీసు మంగళవారం ప్రారంభమైంది. స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ సంస్థ తొలి సర్వీసులో వెళ్తున్న ప్రయాణికులకు విమానాశ్రయ అధికారులు బోర్డింగ్ పాస్‌లను అందజేసి స్వాగతం పలికారు. ఈ విమానం మంగళ, గురు, శనివారాల్లో ఉదయం 10.45 గంటలకు శంషాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.45 గంటలకు అయోధ్య చేరుకుంటుంది. అదే రోజుల్లో తిరిగి అక్కడి నుంచి మధ్యాహ్నం 1.25 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 3.25 గంటలకు శంషాబాద్ చేరుకుంటుంది. ఈ సందర్భంగా విమానాశ్రయ సీఈవో ప్రదీప్ ఫణికర్ మాట్లాడుతూ అయోధ్యకు విమాన సర్వీసులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.





