
208views
విశాఖపట్నం జిల్లా యలమంచిలి మండలంలోని రేగుపాలెం హైవే జంక్షన్‌లో 43 గోవులను అక్రమంగా తరలిస్తున్న కంటెయినర్ లారీని ఎస్‌ఐ సింహాచలం పట్టుకున్నారు. కంటెయినర్‌లో కాలు కదపలేనంతగా గోవులను కుక్కి, తాళ్లతో బంధించడాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయారు. వెంటనే కంటెయినర్ లారీని సీజ్ చేసి, 43 గోవులను విశాఖలోని జ్ఞానానంద గోశాలకు తరలించామన్నారు. గోవుల అక్రమ రవాణాకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు.





