కుల భూషణ్ ను కలిసేందుకు భారత అధికారులను అనుమతించిన పాకిస్థాన్ – అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాల మేరకే

కొద్ది రోజుల క్రితం అంతర్జాతీయ న్యాయస్థానం కుల్‌భూషణ్ జాదవ్ కేసులో భారత్‌కు అనుకూలంగా తీర్పును ఇచ్చిన సంగతి తెలిసిందే..! జాదవ్ కేసును పునః సమీక్షించాలని పాక్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. భారత రాయబార కార్యాలయ అధికారులను కలుసుకునేందుకు.. జాదవ్‌కు అవకాశం ఇవ్వాలని తీర్పులో పేర్కొంది. 2016లో గూఢచర్య ఆరోపణలపై కుల్‌భూషణ్‌ను పాక్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో 2017 ఏప్రిల్‌లో కుల్‌భూషణ్‌కు పాక్ సైనిక కోర్టు మరణశిక్ష విధించింది.
గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్ జైల్లో మగ్గిపోతున్న నేవీ రిటైర్డ్ ఆఫీసర్ కులభూషణ్ జాదవ్ ను కలిసేందుకు భారత అధికారులకు అనుమతి లభించింది. అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కుల్ భూషణ్ ను కలిసేందుకు భారత్ కు మార్గం సుగమమైంది. పాక్ జైల్లో ఉన్న కుల్ భూషణ్ ను శుక్రవారం నాడు భారత దౌత్య అధికారులు కలవనున్నారు. కుల్ భూషణ్ కు న్యాయసహాయం అందించే అంశాలపై అధికారులు మాట్లాడనున్నారు.
గూఢచర్యం ఆరోపణలతో 2016లో జాదవ్‌ను ఇరాన్ నుంచి జాదవ్‌ను పాక్ ఏజంట్లు కిడ్నాప్ చేశారు. అనంతరం బలూచిస్థాన్లో ప్రవేశించినట్టు ప్రకటించారు. 2017 ఏప్రిల్‌లో పాకిస్థాన్ మిలిటరీ కోర్టు అతడికి మరణశిక్ష విధించింది. అయితే ఇరాన్‌లో ఉంటున్న జాదవ్‌ను పాక్ కిడ్నాప్ చేసిందని భారత్ ఆరోపించింది. పాక్ విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 2017 మే 18న జాదవ్ మరణశిక్షపై స్టే విధించింది.