News

అమర్‌నాథ్ యాత్రపై ఉగ్ర కుట్రను చేధించిన భారత భద్రతా దళాలు

365views

తీవ్రవాదులు భారత్ లో మరో కుట్రకు ప్లాన్ వేశారు. గత కొద్ది రోజులుగా ప్రశాంతంగా కొనసాగుతున్న అమర్‌నాథ్‌ యాత్రపై దాడులు చేసి అంతరాయం కల్పించాలని ప్రయత్నాలు చేశారు. అయితే టెర్రరిస్టుల ప్రయత్నాలను భారత భద్రతా దళాలు తిప్పికొట్టాయి. తీవ్రవాదులకు పాకిస్థాన్ మిలటరీ కూడ సహకరిస్తోందనే ఆధారాలను కూడా భద్రతా దళాలు బయటపెట్టాయి.

దాడులకు సంబంధించి తీవ్రవాదులు గత నాలుగైదు రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారని లెఫ్టినెంట్ జనరల్ ఏకే దిల్లాన్ ‌మీడియాతో చెప్పారు. అమర్‌నాథ్ యాత్రకు ఎలాంటి ఆటంకం కల్గకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని చెప్పారు. కాగా తీవ్రవాదులకు పాకిస్థాన్ ఆర్మీ కూడా సహకరిస్తున్నదని ఆయన ఈ సంధర్భంగా తెలిపారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ముద్రతో కూడిన ల్యాండ్ మైన్‌లను మిడీయా ముందు ప్రదర్శించారు.

ఈ నేపథ్యంలో ఎలాంటి దాడులు జరగకుండా అదనపు ఆర్మీ దళాలను అమర్‌నాథ్ యాత్రకు తరలించినట్టు లెఫ్టినెంట్ కల్నల్ పేర్కొన్నారు. మరోవైపు 83 శాతం స్థానిక పిల్లలే డబ్బులకు ఆశపడి పోలీసులపై రాళ్లు రువ్వుతున్నారని, అయితే ఇప్పుడు 500 కోసం రాళ్లు రువ్విన పిల్లలు రేపటి తీవ్రవాదులు అయ్యెందుకు అవకాశం కూడా ఉందని కనుక పిల్లలు దారి తప్పకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని కశ్మీర్ డీజీపీ దిలాబ్ సింగ్ స్థానిక తల్లిదండ్రులను విజ్ఞప్తి చేశారు.