
‘ఇండియా’ కూటమి భాగస్వాములైన కాంగ్రెస్, డీఎంకేలు హిందూ మతాన్ని అవమానించడమే పనిగా పెట్టుకున్నాయని, ఇతర మతాలను మాత్రం పల్లెత్తు మాట అనరని ప్రధానమంత్రి ఎద్దేవా చేశారు. తమిళనాడులోని సేలంలో మంగళవారంనాడు జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ, కాంగ్రెస్-డీఎంకే ఇండి కూటమి ఉద్దేశపూర్వకంగానే హిందూ ధర్మాన్ని విమర్శిస్తోందని, హిందూయిజాన్ని విమర్శించడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించరని అన్నారు.
శక్తిని ధ్వంసం చేస్తామంటున్నారు..
శక్తిని ధ్వంసం చేస్తామంటూ డీఎంకే, కాంగ్రెస్, ఇండియా బ్లాక్ సవాలు చేస్తున్నాయని మోదీ విమర్శించారు. మరియమ్మన్ ఇక్కడి శక్తి మాత. తమిళనాడులో కంచికామాక్షి శక్తి. మధురలో శక్తి మాత మధుర మీనాక్షి. ఆ శక్తిని ధ్వంసం చేస్తామని ఇండి కూటమి చెబుతోంది. హిందూయిజంలో శక్తి అంటే పవర్, తల్లిని పవర్‌గా చెబుతాం. ఆ శక్తిని ధ్వంసం చేస్తామని వారు చెబుతున్నారు” అని మోదీ అన్నారు.





