News

హనుమాన్ పాటలు పెట్టినందుకు హిందూ దుకాణదారుడిపై ఇస్లామిస్ట్‌ల దాడి

607views

షాపులో భక్తిగీతాలు పెట్టి ఆ పాటలు పాడుతున్న యువకుడిపై ఐదారుగురు ముస్లిం యువకులు దారుణంగా దాడి చేసిన ఘటన బెంగళూరులోని సిద్దన్న గల్లి జుమ్మా మసీదు రోడ్డులో చోటుచేసుకుంది. దాడికి గురైన యువకుడి పేరు ముఖేష్ అని పోలీసులు తెలిపారు. బెంగళూరులో ముఖేష్ వర్ధమాన్ టెలికాం అనే మొబైల్ షాప్ నడుపుతున్నాడు. ప్రతిరోజు మొబైల్ షాపులో ముఖేష్ వ్యాపారం చేస్తున్నాడు.

సాయంత్రం మొబైల్ షాపులో ముఖేష్ హనుమాన్ భక్తిగీతాలు పెట్టాడు. ఆ సమయంలో దుకాణానికి నలుగురైదుగురు ముస్లిం యువకులు వచ్చారు. సాయంత్రం నమాజ్ చెయ్యడానికి మేము వెలుతున్న సమయంలో హనుమాన్ చాలీస్ పాటలు పెడుతావారా ?, నీకు ఎంత ధైర్యం అంటూ ముస్లీం యువకులు రెచ్చిపోయారు. మొబైల్ స్పేర్ పార్ట్స్ షాపులో ఉన్న ముఖేష్ అనే యువకుడిని బయటకు లాగి దాడికి పాల్పడ్డారు. నిందితులు అందరూ కలిసి ముఖేష్ ను నేలపైపడేసి దారుణంగా దాడి చేశారని ప్రత్యక్షసాక్షులు, స్థానిక వ్యాపారులు అంటున్నారు.

దాడికి గురైన యువకుడు ఏం చెప్పాడు ?
షాపులో ఎప్పటిలాగే సాయంత్రం పూజలో నేను హనుమాన్ భజన పాటు పెట్టాని అన్నాడు. ఆ సమయంలో షాపు వద్దకు వచ్చి మేము నమాజ్ చేసే సమయంలో ఎందుకు భక్తి పాటలు పాడుతున్నావు, ఆపాటలు ఎందుకు పెట్టావు అని తనను అడిగారని, తరువాత తనను పాటలు నిలిపేయాలని అడ్డుకునేందుకు ప్రయత్నించి తరువాత తన మీద దాడికి దిగారని ముఖేష్ ఆరోపించాడు. ముందుగా స్పీకర్ తీసుకుని నా తలపై కొట్టారని ముఖేష్ పోలీసులకు, మీడియాకు చెప్పాడు.


నిందితులు చేతిలో ఆయుధం పట్టుకుని తనను చితకబాదేశారని, ఆ సమయంలో తనకు చాలా నొప్పి అయ్యిందని, రెండు నెలల క్రితం తాను షాపు తెరిచానని, మొదటి నుంచి రోల్ కాల్ చేస్తూ తనను బెదిరిస్తున్నారని, డబ్బులు దండుకునే ప్రయత్నం చేశారని, మొత్తం ఆరుగురు వచ్చి తన మీద దాడి చేశారని, నిందితులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితుడు ముఖేష్ ఆరోపించాడు.

కేసు నమోదుకు పోలీసులు విముఖత?
దాడికి గురైన యువకుడు ముఖేష్ ఫిర్యాదు చేసేందుకు హలసూరు గేట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు పోలీసులు వెనుకాడుతున్నారని బాధితుడి బంధువులు, అతని స్నేహితులు ఆరోపించారు. పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించిన ప్రజలు, వ్యాపారులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే వరకు వదిలిపెట్టేది లేదని పోలీసులను హెచ్చరించడంతో పోలీసులు తరువాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నిందితులను అరెస్టు చెయ్యకపోతే ?
గత 15 రోజులుగా షాపుపై దౌర్జన్యం చేస్తున్న దుండగులు ఒక్కసారిగా విరుచుకుపడి ముఖేష్ అనే యువకుడిపై దాడికి పాల్పడ్డారు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ హలసూరు గేట్ పోలీస్ స్టేషన్ ఎదుట ఎస్ పీ రోడ్డు పరిసర ప్రాంతాల్లోని వ్యాపారులు ఆందోళనకు దిగారు. నిందితులను అరెస్టు చేసే వరకు పోరాటం ఆగదని వ్యాపారులు హెచ్చరించారు. దాడి చేసిన దుండగులను అరెస్ట్ చేయాలని, నిందితులను అరెస్ట్ చేయకుంటే చిక్కపేట మొత్తం బంద్ చేస్తామని వ్యాపారులు పోలీసులను హెచ్చరించారు.