
199views
సామాజిక పరివర్తన కోసం శతాబ్ది సంవత్సరంలో సామాజిక పరివర్తన కోసం కొన్ని ఆయామాలు తీసుకున్నామని అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్,సర్ కార్యవాహ దత్తాత్రేయహోసబాలే జీ పేర్కొన్నారు. నాగపూర్‌లో జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభ-2024 మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ఏకత్వం కోసం సంఘ ఎల్లప్పుడు ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. సమాజంలో స్పృశ్య, అస్పృశ్య, ఉచ్ఛనీఛ భావాలకు సంబంధించిన ఘటనలు జరిగినప్పుడు సంఘ స్వయంసేవకులు ధార్మిక, సామాజిక కార్యకర్తలతో కలిసి ఆ తప్పులను సరిదిద్దేందుకు ప్రయత్నం చేయడం జరుగుతోందన్నారు. సామాజిక సమరసత అనేది విశ్వాసం యొక్క ప్రకరణమని సంఘకు ఇది శ్రద్ధా విషయమని పేర్కొన్నారు.