NewsProgramms

సంఘమిత్రలో ఘనంగా కార్గిల్ విజయ దివస్

53views

ర్నూలు జిల్లా నంద్యాలలోని సంఘమిత్రలో “కార్గిల్ విజయ దివస్” సంఘమిత్ర ఉపాధ్యక్షులు శ్రీ జె. వెంకటేశ్వర్లు అధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ బచ్చు సంతోష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సంతోష్ మాట్లాడుతూ “కార్గిల్ యుద్ధంలో మన సైనికులు అనేక అవాంతరాలను వీరోచితంగా అధిగమిస్తూ శత్రువులను తుదముట్టించారు. కార్గిల్ యుద్ధంలో అనేకమంది భారత వీర సైనికులు ఆశువులుబాశారు. మనం కూడా వారిలాగే దేశభక్తిని కలిగిఉండాలి” అని కార్యక్రమంలో పాల్గొన్న బాల బాలికలకు తెలియజేశారు.

కార్యదర్శి శ్రీ చిలుకూరి శ్రీనివాస్ సంఘమిత్ర ద్వారా చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాల గురించి వివరిస్తూ సంఘమిత్ర  చిన్నారుల్లో దేశభక్తి పెంపొందించటం కోసం నిరంతరం మహనీయుల జయంతులు, వర్ధంతులు జరుపుతున్నదని తెలిపారు.

కార్యక్రమంలో ప్రధాన వక్త డాక్టర్ ఉదయశంకర్ మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో అమరులైన వీర జవాన్ల త్యాగం వృధా పోదని, ఈ రోజు దేశం గర్వించదగ్గ రోజని, ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగిఉండాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సంఘమిత్ర సభ్యులు శ్రీమతి విజయశ్రీ, ఆంధ్ర ప్రాంత సహకార్యదర్శి శ్రీ మనోహర్, శ్రీ వాసు, సంఘమిత్ర ట్రెజరర్ శ్రీ నాగరాజయ్య పాల్గొన్నారు. కార్యక్రమంలో చిన్నారులు సైనిక వేష ధారణలో చేసిన ప్రదర్శన ఆహూతులను అలరించింది.