News

తిరుమల దర్శనానికి వారికి మినహా ఇతరులకు అనుమతి లేదు

359views

టీటీడీ ధర్మకర్తల మండలి మాజీ సభ్యులకు సంవత్సరంలో కొన్నిసార్లు వారి కుటుంబ సభ్యులతో (భార్య, పిల్లలతో, తల్లి, తండ్రి ) శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం బోర్డు కల్పించిందని టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. అయితే కొందరు మాజీ బోర్డు సభ్యులు ఈ నిబంధనకు విరుద్ధంగా తమ కుటుంబ సభ్యులతో కాకుండా ఇతరులను వెంట బెట్టుకొని దర్శనం కొరకు పదే పదే రావడం మంచి పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు.మాజీ బోర్డు సభ్యులు ఆ హోదాలో కేవలం వారి కుటుంబ సభ్యులతో మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాలని ఇతరులను వెంట బెట్టుకుని వస్తే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు.