
219views
పురాణ ఇతిహాసాలతో కూడిన ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రజల్లో దైవ చింతన పెంపొందించేందుకు దోహదపడతాయని ఉప ముఖ్యమంత్రి, దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా సీతానగరంలోని స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ ఎడ్మినిస్ట్రేషన్ (సిత)లో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఆయన మంగళవారం రాత్రి ప్రారంభించారు. అక్కడ ఉన్న పలు గ్రంథాలను ఆయన ఆసక్తిగా తిలకించారు. ఇటువంటి గ్రంథాలు నేటి తరం పిల్లలు తప్పనిసరిగా చదవాలని సూచించారు. రామాయణం, మహాభారతం, భగవద్గీత వంటి గ్రంథాలను చదివి వాటిల్లోని సారాంశాన్ని తెలుసుకుంటే జీవితం అద్భుతంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం పెంపొందేందుకు ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు





