
251views
శ్రీశైల మల్లన్న కొండ భక్తజనంతో నిండిపోయింది. బ్రహ్మోత్సవాల్లో కీలకఘట్టమైన పాగాలంకరణ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. శివరాత్రిని పురస్కరించుకొని శుక్రవారం రాత్రి 12 గంటలకు స్వామిఅమ్మవార్ల కల్యాణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల ఏడో రోజు గురువారం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి గజ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామికి వాహనసేవకు ముందే పట్టువస్త్రాలు సమర్పించడం కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. ఇందుకు భిన్నంగా దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గురువారం రాత్రి వాహనసేవ ముగిశాక పట్టువస్త్రాలు సమర్పించారు.





