News

పుష్పపల్లకిలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీశైల మల్లన్న

176views

నంద్యాల జిల్లా శ్రీశైల మహక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంభరాన్నంటాయి శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి అమ్మవారు బ్రహ్మోత్సవాలు ఆరోవరోజు పుష్పపల్లకిలో భక్తులకు దర్శనమిచ్చారు పుష్పపల్లకిలో శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి హారతులిచ్చారు విద్యుత్ దీపకాంతుల నడుమ శ్రీశైల పురవీధులలో శ్రీస్వామి అమ్మవార్లు గ్రామోత్సవానికి తరలుతుండగా ఉత్సవం ముందు కోలాటాలు డమరక నాధాలు పలు రకాల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి ఆలయం ముందు పలు రకాల పుష్పాలతో దేదీప్యమానంగా సర్వాంగ సుందరంగా తయారుచేసిన పుష్పపల్లకిలో శ్రీస్వామి అమ్మవార్లు గ్రామోత్సవంలో భక్తులను కనువిందు చేశారు గంగాధర మండపం వద్ద పుష్పపల్లకిలో ఉన్న శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక హారతులిచ్చి అనంతరం అంకాలమ్మ గుడి, నంది మండపం బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు శ్రీస్వామి అమ్మవార్ల గ్రామోత్సవం కన్నులపండువగా సాగింది గ్రామోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిమంది భక్తులు తరలివచ్చారు పుష్పపల్లకిపై ఉన్న శ్రీస్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు