News

శివలింగానికి పూజలపై 8 వారాల్లో తేల్చండి : జ్ఞానవాపీ కేసులో హైకోర్టు ఆదేశం

531views

జ్ఞానవాపీ మసీదులో కనుగొన్న శివలింగానికి షరతుల్లేకుండా పూజలు చేసుకునేందుకు అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ల పై విచారణ జరిపి 8 వారాల్లోగా నిర్ణయం వెలువరించాలని వారణాసి కోర్టును అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. వారణాసి కోర్టులో వేగంగా విచారణ జరిగేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిష నన్ను విచారించిన జస్టిస్ మనీశ్ కుమార్ నిగం ధర్మా సనం సోమవారం ఈ ఆదేశాలిచ్చింది. వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం పక్కనున్న జ్ఞానవాపీ మసీదులో సర్వే సందర్భంగా 2022 మే 16వ తేదీన శివలింగం బయటపడింది.