ArticlesNews

గోల్డెన్ గాళ్ హిమా దాస్

56views

కేవలం నెల వ్యవధిలో 4 స్వర్ణ పతకాలు గెలుచుకున్న పరుగుల సంచలనం, థింగ్ ఎక్స్ ప్రెస్ గా పేరు గాంచిన 19 ఏండ్ల స్ప్రింట్ రన్నర్ హిమా దాస్ మరళా మరో స్వర్ణాన్ని సాధించారు. 2000 వ సంవత్సరం జనవరి 9వ తేదీన అస్సాంలో జన్మించిన ఈ యువ క్రీడాకారిణి 2018వ సంవత్సరంలో ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన ఏషియన్ గేమ్స్ లో పరుగు పందెంలో 400 మీటర్ల  లక్ష్యాన్ని 50.79 సెకన్లలో పూర్తి చేసిన తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పారు. పరుగు పందెంలో భారత్ తరపున స్వర్ణం సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళ ఈమే కావడం విశేషం.

20/7/2019 గత శనివారం సీజేక్ రిపబ్లికన్లో జరిగిన పోటీల్లో ఈ యువ క్రీడాకారిణి తన అయిదవ స్వర్ణాన్ని సాధించడం గమనార్హం. ఆమె ఈ ఘనతను కేవలం 52. 09 సెకన్లలో సాధించారు. ఈ సీజనులో ఇదే అత్యుత్తమ ప్రదర్శన.

ఈ ఘనతను సాధించినందుకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని మోడీ, లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ప్రముఖ వ్యాపార వేత్త గోలకిరణ్ మజుందార్, బిగ్ బి అమితాబ్ తదితరులు తమ ట్వీట్ల ద్వారా అభినందించారు. అద్భుతాన్ని సాధించిన బంగారు బాలిక (Golden Girl) గా ఆమెను వారు ప్రశంశించారు.