
286views
మహాభారతం మానవ జీవితాలకు దిక్సూచి లాంటిదని, ఇందులో 64 కళలకు సంబంధించిన కథలున్నాయని సుప్రసిద్ధ పండితులు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం అన్నారు.శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో మూడు రోజుల పాటు ‘ఆంధ్ర మహాభారతం- భారతీయ దార్శనికత’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సు గురువారంతో ముగిసింది. అధ్యయన కేంద్ర సంచాలకులు మాడభూషి సంపత్ కుమార్ మాట్లాడుతూ మూడు రోజుల సదస్సులో మహాభారతంపై 60కి పైగా పత్రాలు సమర్పించారని, అవి వైవిధ్యంగా ఉన్నాయన్నారు. చివరి రోజుల సదస్సులో పలువురు ఆచార్యలు పండితులు ప్రసంగించారు. భవిష్యత్తులో వీటిని కూడా ప్రచురించి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. కార్యక్రమంలో ఆచార్యులు కసిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర నాయుడు, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





