News

సనాతన ధర్మం సర్వ మానవాళి శ్రేయేస్సు కోసమే

263views

సనాతన ధర్మం సర్వ మానవాళి శ్రేయేస్సు కోసమే ఉద్దేశించినట్లు కంచి శ్రీ కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి అన్నారు. గురువారం ఆయన తన విజయాత్రలో భాగంగా కడప నగర శివార్లలోని చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో గల శ్రీ లలితా పంచాయతన ఆలయానికి విచ్చేశారు. ఆలయ నిర్వాహకులు స్వామి తురియానంద సరస్వతి, అర్చకులు, వేద పండితులు, ధార్మివేత్తలు, నగర ప్రము ఖులు, భక్తులు ఆయనకు సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన త్రికాల పూజను ప్రారంభించారు. అందులో భాగంగా ఆదిశంకరాచార్యుల మహాప్రసాదమైన అరుదైన శ్రీ చంద్రమౌళీశ్వర స్పటిక లింగంతోపాటు మహామేరువు శ్రీ చక్రాలతో విశేష పూజలు, అభిషేక కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం కంచి పరమాచార్యులు శ్రీ చంద్రశేఖర సరస్వతిస్వామి జీవిత విశేషాలను వివరించారు. సాయంత్రం ధ్యాన మందిరంలో భక్తులతో సత్సంగం నిర్వహించి అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు స్వామి తురియానంద సరస్వతి చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో గ్రామ ప్రాంతాల్లో శాంతి సాధన కోసం చేసిన కార్యక్రమాల గురించి వివరించారు.