News

సింహాలకు వివాదాస్పద పేర్లు పెట్టిన అధికారి సస్పెండ్..

234views

జూలోని ఆడ, మగ సింహాలకు వివాదాస్పద పేర్లు పెట్టిన ఘటనలో ఓ ఉన్నతాధికారిని త్రిపుర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. హైకోర్టు తీర్పు తర్వాత రాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.

జూలోని ఆడ, మగ సింహాలకు వివాదాస్పద పేర్లు పెట్టిన ఘటనలో ఓ ఉన్నతాధికారిని త్రిపుర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. హైకోర్టు తీర్పు తర్వాత రాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. సింహాలకు అక్బర్, సీత అని పేరు పెట్టడంపై వివాదం చెలరేగింది. ఈ పేర్లు మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని విశ్వ హిందూ పరిషత్ – వీహెచ్‌పీ కలకత్తా హైకోర్టుకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన హైకోర్టు ఘాటుగా స్పందించింది. ఈ తరుణంలో ఉన్నతాధికారి ప్రబిన్ లాల్ అగర్వాల్‌ను సస్పెండ్ చేస్తూ త్రిపుర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 12న సెపాహిజాలా జూ పార్క్ ఆడ మగ సింహాలకు అక్బర్, సీత పేర్లు పెట్టింది. కోర్టు తీర్పు ఇచ్చేంత వరకు అక్కడే ఉన్న సింహాలను పశ్చిమబెంగాల్ లోని సిలిగురికి తీసుకువచ్చారు. నార్త్ బెంగాల్ వైల్డ్ యానిమల్స్ పార్క్ అధికారులు వీటి పేర్లు మార్చే ప్రయత్నాల్లో ఉన్నారు.