
291views
తిరుపతిలో స్వామి సేవలో తరలించాల్సిన టీటీడీ ఉద్యోగుల్లో కొందరు సంస్థ ఛైర్మన్ సేవలో పునీతమవుతున్నారు. ఆయన అడుగులకు మడుగులొత్తుతూ.. పూలు చల్లుతూ.. మంగళ వాయిద్యాలు వాయిస్తూ.. రాజకీయ పార్టీ రంగుల పూలమాలలతో ఆహ్వానం పలకడం విశేషం. స్వామికి సేవ చేయాల్సిన ఉద్యోగులు ఇలా చేయడంపై ‘ఇదేమి వైపరీత్యం శ్రీనివాసా.. గోవిందనామాలు వినిపించాల్సిన ప్రదేశంలో ఈ వ్యక్తి జపం ఏమిటంటూ భక్తులు బుగ్గలు నొక్కుకుంటున్నారు. శుక్రవారం తిరుపతిలోని తితిదే పరిపాలన భవనంలో ఛైర్మన్, ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డికి ఉద్యోగులు ఇలా ఆత్మీయ సన్మానం నిర్వహించి పులకించారు.





