
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఓఎస్డీ మహేశ్వరరెడ్డి ఎదుట మావోయిస్టు, మిలీషియా సభ్యులు బుధవారం లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గొల్లపల్లి ఎల్వోఎస్ పార్టీ సభ్యుడు పద్దం అడమయ్య, మిలీషియా సభ్యుడు కణితి లచ్చలు మావోయిస్టులు సిద్ధాంతాలకు విసిగిపోయి జన జీవన స్రవంతిలోకి కలవాలని పోలీసుల ఎదుట లొంగిపోయారని వివరించారు. వీరిద్దరూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలో గచ్చనపల్లి గ్రామానికి చెందిన వారని పేర్కొన్నారు. ఆంధ్రా పోలీసులు చేపట్టిన పరివర్తన, ప్రేరణ కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. ఎల్వోఎస్ సభ్యుడిగా పని చేస్తున్న పద్దం అడమయ్య 2014లో మావోయిస్టు పార్టీలో చేరి అనేక విద్వం సంఘటనల్లో పాల్గొన్నాడని తెలిపారు. 2016 నుంచి ఛత్తీస్‌గఢ్‌లో 34 మంది పోలీసులు మృతి చెందిన సంఘటనలకు ఇతడి పాత్ర కీలకమని చెప్పారు. సీఆర్ప్‌ఎఫ్ ఈ 42 బెటాలియన్ ఇన్‌స్పెక్టర్ మోతిలాల్ సైనీ పాల్గొన్నారు.





