News

నిత్య యోగా సాధనతో ఆరోగ్యం

208views

రోజూ యోగా సాధన చేస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని పతంజలి యోగా భారత అధ్యక్షులు స్వామి పరమార్దదేవ్‌ పేర్కొన్నారు. జార్జిక్లబ్‌ ప్రాంగణంలో పతంజలి యోగా, భారత స్వాభిమాన ట్రస్టు అధ్వర్యంలో నిర్వహిస్తున్న యోగా, ధ్యాన తరగతుల శిక్షణ కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. ప్రత్యేక ఆసనాలను సాధకులతో వేయించారు. నిత్య యోగా సాధనతో ఆసుపత్రుల అవసరం ఉండబోదన్నారు. పిల్లలకు జ్ఞాపక, వ్యాధినిరోధకశక్తి యోగా ద్వారా సిద్ధిస్తుందన్నారు. బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులకు వివేకానంద ఛారిటబుల్‌ ట్రస్టు అధ్యక్షులు విష్ణుమూర్తి పుస్తకాలను, పెన్నులు అందజేశారు. పతంజలి యోగా భారత ఉపాధ్యక్షులు రిథిదేవ్‌ స్వామిజీ, భారత స్వాభిమాన ట్రస్టు రాష్ట్ర అధ్యక్షులు చినబాబు, పూర్వ అధ్యక్షులు శ్రీనివాస్‌, భారత స్వాభిమాన్‌ ట్రస్టు జిల్లా అధ్యక్షులు దొరమ్మనాయుడు, జార్జిక్లబ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.