News

అయోధ్యకు గుంటూరు నుంచి ప్రత్యేక రైలు ప్రారంభం

243views

అయోధ్యలోని బాలరాముని ఆలయం దర్శనార్థం గుంటూరు నుంచి రామభక్తులతో బయల్దేరిన అయోధ్య ప్రత్యేక రైలును బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్‌, శివస్వామిజీ జెండా ఊపి ప్రారంభించారు. పురందేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రం నుంచి అయోధ్యకు వెళ్తున్న తొలి రైలు అని చెప్పారు. భక్తులు బాలరాముని దర్శనం కోసం వెళుతుంటే చూడాలని మాత్రమే వచ్చానన్నారు. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో ప్రతిష్ట జరగడం చూస్తే ఆనందంగా ఉందని తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలు పునర్వైభవం సంతరించుకోవడానికి ప్రధాని నరేంద్రమోదీ త్యాగ ఫలితమేనని వెల్లడించారు. శ్రీరాముని చల్లని చూపు ఉండాలని పై ఉండాలని ఆకాంక్షించారు.