News

ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సమ్మతి

213views

ఉమ్మడి పౌరస్మృతి బిల్లును బుధవారం ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ మూజువాణి ఓటుతో ఆమోదించింది. సెలక్ట్‌ కమిటీకి పంపాలన్న విపక్షాల సూచనను తిరస్కరించింది. ఈ బిల్లుకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేస్తే దేశంలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసే తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ నిలవనుంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే వివాహం, విడాకులు, భూములు, ఆస్తులు, వారసత్వం వంటి విషయాల్లో కులమతాలకు సంబంధం లేకుండా ఒకే నిబంధనలు వర్తించనున్నాయి. గిరిజనులకు మాత్రం ఈ బిల్లు వర్తించదు. మహిళల హక్కులకు ఈ బిల్లుతో రక్షణ లభించనుందని ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి శాసనసభలో తెలిపారు.