News

కొండవీడు వైభవాన్నితెలిపేలా ‘కొండవీటి ఫెస్ట్‌ – 2024‘ ఉత్సవాలు

304views

రెడ్డి రాజులు 12,13 శతాబ్దంలో కొండవీడును పరిపాలించారని, వారి వైభవాన్ని గుర్తు చేసుకుంటూ ‘కొండవీటి ఫెస్ట్‌ – 2024‘ పేరి ట ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌ నిర్వహించిన పత్రికా సమావేశంలో ఈ ఉత్సవాల వివరాలు వెల్లడించారు. ఈనెల 10, 11 తేదీలలో వరుస సెలవుల నేపథ్యంలో ఈ ఉత్సవం నిర్వహిస్తున్నామన్నారు. కొండవీడు కోటను పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తే జిల్లాకు చుట్టుపక్కల జిల్లాల నుంచి, పర్యాటకులు వచ్చే అవకాశం ఉందన్ని ఆ లక్ష్యంతో కొండవీటి కోటను అభివృద్ధి చేశామన్నారు. కొండవీటి కోటలో ఉత్సవాల నిర్వహిస్తే పర్యాటకంగా మరింత అభివృద్ధికి అవకాశం ఉండటంతో ఈ ఫెస్ట్‌ నిర్వహిస్తున్నామన్నారు. ఆ ప్రాంతమంతా రిజర్వ్‌ ఫారెస్ట్‌ కావడంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని, పర్యాటకులు సైతం సహకరించి అటవీ రక్షణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సమయంలో కొండవీడు కోటను సందర్శిస్తే బా గుంటుందని, అక్కడికి వచ్చే సందర్శకుల కో సం యువత, చిన్న పిల్లలు, పెద్దల కోసం ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కొండవీడు కోటలో ప్రధానంగా ట్రెక్కింగ్‌, రాక్‌ క్‌లైంబింగ్‌, షూటింగ్‌, ఆర్చరీ, చెరువులో బోటింగ్‌, ఫిషింగ్‌, హార్సింగ్‌ ఏర్పాటు చేశామన్నారు. అక్కడకు వచ్చే పర్యాటకులు రాత్రి విడిది చేసేందుకు ‘నైట్‌ క్యాంప్‌‘లో భాగంగా టెంట్‌, భోజన వసతులను ఏర్పా టు చేశామన్నారు.

ప్రత్యేకంగా హె లిరైడ్‌…

కొండవీడు ఫెస్ట్‌–2024 సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా హెలీకాఫ్టర్‌ ద్వారా ఈ ప్రాంతాన్ని చూపించే విధంగా హెలీరైడ్‌ను ఏర్పాటుచేశామని కలెక్టర్‌ తెలి పారు. ఇందుకోసం ఒక్కొక్కరికి రూ.4 వేలు వసూ లు చేసి ఏడు నిమిషాలపాటు రైడ్‌ ఉంటుందన్నా రు. పారామోటార్‌ రైడ్‌ ఏర్పాటుచేశామని, ఒక్కొక్కరికి రూ.2వేలు, హార్స్‌ రైడుకు రూ.500 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఉత్సవాల తరహాలో చిన్నపిల్లల కోసం ప్లే ఏరియాను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పూల తోటలతోపాటు ఇసుకను ఏర్పా టు చేయించి అందులో సైతక శిల్పం తరహాలో ఆర్ట్‌ గీసేలా ఏ ర్పాటుచేస్తామన్నారు. వీటితోపాటు చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా నృత్య ప్రదర్శనలకు ప్రత్యేకంగా వేదిక ఏర్పాటుచేసి క్లాసికల్‌, వెస్ట్రన్‌ పోటీలు నిర్వ హిస్తామన్నారు. విజేతలకు రూ.10,116 నుంచి రూ.2,500 బహుమతులు అందజేస్తామన్నారు.