
343views
భారత నౌకాదళానికి అవసరమయ్యే ‘ఐఎన్‌ఎస్ సంధాయక్’ సర్వే నౌకను శనివారం జాతికి అంకితం చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శుక్రవారం సాయంత్రం 6.15 గంటలకు ప్రత్యేక విమానంలో నేవల్ ఎయిర్ స్టేషన్ ‘ఐఎన్‌ఎస్ డేగా’కు చేరుకున్నారు. ఆయనకు నేవీ అధికారులు స్వాగతం పలికి తూర్పు నౌకాదళం చోళ సూట్‌కు తీసుకెళ్లారు. మంత్రి శుక్రవారం రాత్రి అక్కడే బస చేసేందుకు నేవీ వర్గాలు ఏర్పాట్లు చేశాయి. కేంద్రమంత్రి శనివారం ఉదయం 6.15 గంటలకు డాల్ఫిన్ కోవ్ వద్ద నిర్వహించే యోగాలో పాల్గొంటారు.9 గంటలకు నేవల్ డాక్‌యార్డు పరేడ్ మైదానంలో సైనిక వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత ఐఎన్‌ఎస్ సంధాయక్ సర్వే నౌకను జాతికి అంకితం చేసి… 10.30 గంటలకు ఐఎన్‌ఎస్ డేగాకు బయలుదేరి, అక్కడి నుంచి దిల్లీకి వెళ్లనున్నారు.





