Newsvideos

స్వయంసేవక్ రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో PFIకు చెందిన 15 మందికి మరణశిక్ష

162views

కేరళలోని స్థానిక న్యాయస్థానం సంఘ్ స్వయంసేవక్ రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో నిషేధిత ఇస్లామిక్ సంస్థ అయిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా PFIకు చెందిన 15 మంది నిందితులకు మరణశిక్షను విధించింది. కేరళలోని మావేలికర అదనపు సెషన్స్ కోర్టు జనవరి 30న తీర్పు వెలువరించింది. న్యాయస్థానం తెలిపిన వివరాల ప్రకారం 15 మంది నిందితుల్లో ఎనిమిది మంది హత్యలో పాల్గొన్నట్టు నిర్ధారించింది.వారితో పాటు మిగిలిన నలుగురిని సైతం దోషులుగా తేల్చింది. ఎందుకంటే సంఘటనా స్థలంలో ప్రధాన దోషులతో పాటు వీరు మారణాయుధాలు కలిగి ఉండి, హత్యకు సహకరించారని న్యాయస్థానం నిర్థారించింది.

కేరళలోని కమ్యూనిస్టు విజయన్ ప్రభుత్వం రాజకీయ రక్షణతో నిషేధిత ఇస్లామిక్ సంస్థలు పీఎఫ్ఐ, ఎస్‌డీపీఐకి చెందిన ఛాందసవాదులు సంఘ్‌కు చెందిన కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్నారు.2021 డిసెంబర్ 19 రాత్రి రంజిత్ శ్రీనివాస్ ఇంట్లోకి బలవంతంగా చొరబడి అతడిని దారుణంగా హత్య చేశారు.

న్యాయస్థానం నయిసమ్, అజ్మల్, అనూప్, మహ్మద్ అస్లాం, అబ్దుల్ కలాం, సఫరుద్దీన్, మున్షాద్, జసీబ్ రాజా, నవాస్, సమీర్, నజీర్, జాకీర్ హుస్సేన్, షాజీ పూవతుంగల్ మరియు షెర్నాజ్ అష్రఫ్ మొత్తం 15 మందిని దోషులుగా నిర్థారించింది. వీరికి తాజాగా న్యాయస్థానం మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

కోర్టు తీర్పును బాధిత కుటుంబం స్వాగతించింది. ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ శ్రీనివాసన్ కుటుంబ సభ్యులు తాము సంతృప్తి చెందినట్లు తెలిపారు.