News

రూ.47.65లక్షల కోట్లతో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశట్టిన ఆర్థిక శాఖ మంత్రి

349views

25 ఏళ్లలో సాధించాల్సిన అభివృద్ధికి బాటలు వేస్తూ కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక ఏడాదికి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఎన్నికల తాయిలాలకు ఏలాంటి చోటు లేకుండానే పద్దును ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, పేద, మధ్యతరగతి సొంతింటి కల నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 47లక్షల 65వేల 768 కోట్ల రూపాయల అంచనాలతో బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించారు. అత్యధికంగా రక్షణ రంగానికి 6లక్షల 20వేల కోట్లు కేటాయించారు.

ఈ 25 ఏళ్లను అమృత్‌ కాలంగా భావిస్తుండగా, ఇటీవల ప్రకటించిన భారత్‌-పశ్చిమాసియా-ఐరోపా ఆర్థిక కారిడార్‌ దేశ ప్రగతి గతిని మారుస్తుందని నిర్మల తెలిపారు. మొత్తం రూ.47.65 లక్షల కోట్ల (రూ.47,65,768) రూపాయల అంచనాలతో బడ్జెట్‌ ప్రకటించిన ఆర్థిక మంత్రి విత్త లోటు 5.1 శాతంగా ఉంటుందని తెలిపారు. మూలధన వ్యయం 11 శాతంగా ఉంటుందని చెప్పిన మంత్రి ఇది 11లక్షల 11 వేల కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. అభివృద్ధి భారత్‌ లక్ష్యంలో భాగంగా రాష్ట్రాలకు రూ.75వేల కోట్లు వడ్డీలేని రుణాల గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యక్ష, పరోక్ష పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు లేవన్న మంత్రి ఎగుమతి, దిగుమతి సుంకాల్లోనూ ఎలాంటి మార్పులు చేయలేదు. బడ్జెట్‌లో రక్షణశాఖకు రూ.6.2లక్షల కోట్లు కేటాయింపులు చేశారు.