
320views
‘ఐఎన్‌ఎస్ సంధాయక్’ నౌకను ఫిబ్రవరి 3న జాతికి అంకితం చేయనున్నారు. ఇందుకోసం తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఆధ్వర్యంలో విశాఖలోని నేవల్ డాక్‌యార్డులో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, నౌకాదళ అధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ రానున్నారు. నౌకాదళ ఉపయోగార్థం హైడ్రోగ్రాఫిక్ సర్వే జరిపేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ ఆదేశాలతో కోల్‌కతాలోని ‘గార్డెన్‌రీచ్ షిప్ బిల్డింగ్ ఇంజినీర్స్ (జీఆర్‌ఎస్‌ఈ) సంస్థ ‘ఐఎన్‌ఎస్ సంధాయక్’ను నిర్మించింది. 2021 డిసెంబరు 5న జలప్రవేశం చేయించి.. పనులు పూర్తి చేశారు. నౌక 3,800 టన్నుల సామర్థ్యంతో 110 మీటర్ల పొడవుంది. దీనిపై ఓ హెలిపాడ్, సర్వే సాంకేతిక పరికరాలు, రెండు డీజిల్ యంత్రాలు అమర్చారు.





