News

పాపిష్టి పాస్టర్‌

106views

కేరళలోని ఒక బాలుర హాస్టల్‌కు డైరక్టరుగా ఉన్న జార్జ్ అనే 40 సంవత్సరాల పాస్టర్‌ విద్యార్థులను లైంగిక వేధింపులకు గురిచేశాడు. హాస్టల్‌ విద్యార్థులు ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. తమను పాస్టర్ గత ఆరు నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని వారు తెలిపారు. దీంతో విద్యార్థుల తల్లి దండ్రులు పాస్టర్‌పై స్థానిక పోలీస్ స్టేషన్‌లో పిర్యాధు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికంగా విచారణ చేపట్టి పాస్టర్‌ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. దీంతో కోర్టు పాస్టర్‌కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది .