News

గుంటూరులో అయోధ్య అభయాన్ అక్ష‌తల రథ‌యాత్ర

398views

హిందువుల శతాబ్దాల కల అయిన అయోధ్య రామాలయం ఈ నెల 22 న ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ పవిత్ర ప్రాంతం నుంచి వచ్చిన అక్ష‌త‌ల‌ను దేశం నలమూలలా పంచే కార్యక్రమాన్ని హిందూ చైతన్య వేదిక వంటి పలు సంస్ధలు చేపట్టాయి. ఈ క్రమంలో గుంటూరు నగరంలో నిర్వహించిన అయోధ్య అభియాన్ అక్ష‌తల రథ‌యాత్రలో వందలాది మంది భ‌క్తులు పాల్గొన్నారు.మేళతాళాలతో గుంటూరు నగరవీధుల గుండా సాగిన ఈ రథ‌యాత్రలో ఆబాల గోపాలం పాల్గొని అయోధ్య రాముని స్మ‌రించుకున్నారు.