Newsvideos

శ్రీనగర్‌లోని ఆనందేశ్వర్ భైరవనాథ్ ఆలయంలో మూడు దశాబ్దాల తర్వాత పూజలు

358views

జమ్మూ కాశ్మీర్‌లో రాజధాని శ్రీనగర్‌లో 32 ఏళ్ల తర్వాత 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఆనందేశ్వర్ భైరవనాథ్ ఆలయంలో హవనం (హోమం)తో పాటు ప్రత్యేక పూజలు జరిగాయి. భగవాన్ శ్రీ భైరవనాథుని జన్మదినాన్ని పురస్కరించుకుని కాశ్మీర్ పండిత్ లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

మా చిన్నతనంలో హవాన్ నిర్వహించడాన్ని చూసాము. ఆ తర్వాత చూడలేదు. ఇంత కాలం తరువాతైన ఈ కార్యక్రమం జరగటం సంతోషం. ఈ రోజు పరిస్థితులు బాగున్నాయి. స్వేచ్ఛగా ఆలయానికి రావడంతో పాటు స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాము. మునపటి భయానక పరిస్థితులు ఇప్పుడు లేవని ఈ సందర్భంగా కాశ్మీరీ పండిట్‌లు పేర్కొంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.


ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో రోజు రోజుకు మెరుగువుతున్న పరిస్థితులకు ఇలాంటి కార్యక్రమాలు అద్దంపడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు