News

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల వివరాలు

280views

శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఏప్రిల్ కు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను టిటిడి విడుదల చేయనుంది.

• ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మో త్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఆన్లైన్లో విడు దల చేస్తారు. వర్చువల్ సేవా టికెట్లను అదే రోజు మధ్యాహ్నం 3 గంట లకు అందుబాటులో ఉంచుతారు.

• శ్రీవారి వార్షిక వసంతోత్సవం ఏప్రిల్ 21 నుంచి 23వ తేదీ వరకు జరుగ నుంది. ఇందుకు సంబంధించిన సేవా టికెట్లను ఈ నెల 22న ఉదయం పది గంటలకు విడుదల చేయనున్నారు.

• ఈ నెల 23వ తేదీ ఉదయం పది గంటలకు అంగప్రదక్షిణం టోకెన్ల కోటా. ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, గదుల కోటాను విడుదల చేస్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను అందుబాటులో ఉంచుతారు.

• ఈ నెల 24వ తేదీ ఉదయం పది గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ. 300 టికెట్ల కోటాను విడుదల చేస్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్ కు వీలు కల్పించనున్నారు.

• ఏప్రిల్ కు సంబంధించి జనవరి 27వ తేదీ ఉదయం 11 గంటలకు తిరు మల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవా కోటాను, మధ్యాహ్నం 12 గంట లకు నవనీత సేవ కోటాను, ఒంటి గంటకు పరకామణి సేవా కోటాను https://ttdevasthanams.ap.gov.in సైట్లో టికెట్లను బుక్ చేసుకోవాలని టిటిడి అధికారులు కోరారు.