
అయోధ్యలోనున్న శ్రీరామ జన్మభూమి ఉద్యమాన్ని ముగింపు దశ వరకు చేర్చుటలో బహుమూల్యమైన పాత్ర ఎందరిదో ఉండింది. అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణంకు సుదీర్ఘ పోరాటం జరపాల్సి వచ్చింది. ఎందరో ప్రాణత్యాగాలే ఈనాటి రామమందిర నిర్మాణం. అనేకమంది అజ్ఞాతవీరులు ఉన్నారు. రామ్ కొఠారి, శరద్ కొఠారీ ఈ కోవలోని వాళ్ళే.
చిన్నప్పటి నుండి కొఠారి సోదరులు ప్రజలకు సేవ చేయడంలో తమ కర్తవ్యాన్ని చాలా చక్కగా నిర్వర్తించేవారు. వారు కరసేవకు వెళ్ళే ముందుకూడా శీలపూజ మరియు రామజ్యోతి పూజలను వారు విజయవంతంగా నిర్వహించారు.అలాగే ప్రజలకు సేవ చేస్తుండేవారు. ఎప్పుడైతే కర సేవకు పిలుపునిచ్చారో, వారు ఇద్దరు స్వయంగా ముందుకు వచ్చి ‘‘మేము వెళ్తాం’’ అని సంఘ్ కు చెప్పారు.
అక్టోబర్ 22న తమ అయోధ్య యాత్రను ప్రారంభించారు.అక్టోబర్ 22న కలకత్తా నుంచి మొదలైన వీరి యాత్ర ఇక్కడ నుంచే కష్టతరంగా మారింది. ట్రైన్లు రద్దయ్యాయి. అయోధ్యకు రైళ్లు లేవు. దీంతో బెనారస్ వరకు రైలులో వెళ్లి..అక్కడ నుంచి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వారు బెనారస్‌కు చేరుకునే సరికి, వాళ్లకు తెలిసిందేంటంటే దారులన్నీ బంద్ అయ్యాయని.. అయోధ్యకు వెళ్లే ఏ మార్గం తెరిచి లేదు. ధృడ నిశ్చయంతో ముందుకు కదిలారు. 30 అక్టోబరున వాళ్లు అయోధ్యకు చేరుకున్నారు. వారు అయోధ్యకు చేరుకునే సరికి అక్కడ కర సేవకు పిలుపునివ్వడం జరిగిపోయింది. బారికేడ్లు విరిపోయినప్పుడు అందరికంటే ముందుగా వెళ్లి అగరబత్తులను వెలిగించి అక్కడ అంజలి ఘటించి తమ శిబిరాలకు చేరుకున్నారు.
అలాగే మరుసటి రోజు ప్రభుత్వ మీడియా, ప్రభుత్వ యంత్రాంగం అసత్యాలను ప్రచారం చేసింది. వాళ్లు ఏం చెప్పారంటే, అక్కడ ములాయం సింగ్ చెప్పినట్లు పక్షి కూడా రెక్క ఆడించలేదు అది నిజమైందని, ఏ ఒక్క కర సేవకుడు ఏమీ చేయలేదని, ఎటువంట కర సేవ జరగలేదని ఇదంతా వినగానే కర సేవకుల్లో స్వాభావికంగానే ఆవేశం కలిగింది. 2 నవంబరున సాంకేతిక కర సేవ చేయాలని. సంఘ్ మరోసారి కొత్త నిర్ణయం తీసుకుంది. రామ నామం జపిస్తూ ముందుకు సాగుతున్న వాళ్లపై టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీ ఛార్జ్ చేశారు.
ఇటువంటి పరిస్థితిలో రామ్, శరద్ సోదరులు సమీపంలోని ఇంట్లో ఆశ్రయం పొందారు. హఠాత్తుగా ఆ ఇంటి తలుపుల గుండా ఎవరో ఒక కర సేవకుడు మూలుగుతున్నట్లు నీళ్లు నీళ్లు అంటూ మాటలు వినిపించాయి. అతడికి సహాయం అవసరమనే భావనతో శరద్ కొఠారి తలుపు తెరిచాడు. తలుపు తెరుస్తూనే అతడిని లాగి కాల్చి చంపారు. అతని ఛాతీలో రెండు తూటాలు దూసుకెళ్లాయి.
అంతలో రామ్ కొఠారి ముందుకు వచ్చాడు. అతడు వాళ్లని ప్రశ్నించాడు నా తమ్ముడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారని..ఆ సమయంలో అతడిని కూడా కిందకు నెట్టేశారు. అతడిపై కూడా కాల్పులు జరిపారు. అతడి తలపై కాల్చారు. అలా రామ జన్మభూమి కోసం ఇద్దరు సోదరులు తమ ప్రాణాలను అర్పించారు.





