తెల్ల దొరల కాలం నాటి ఆచారాన్ని పక్కన పెట్టి భారతీయ పద్ధతిలో… చరిత్ర సృష్టించిన కేంద్ర ఆర్ధిక మంత్రి.

దేశ చరిత్రలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారు. ఇదే సమయంలో ఆంగ్లేయుల కాలం నుంచి వస్తున్న బ్రిటీష్ సాంప్రదాయానికి ఆమె ముగింపు పలికి సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు. ఆంగ్లేయుల పాలన కాలం నుంచి గత ఏడాది కేంద్ర బడ్జెట్ వరకు బడ్జెట్ పత్రాలను లెదర్ సూట్‌కేసులో తీసుకురావడం జరిగింది.
అయితే ఈ సాంప్రదాయాన్ని పక్కనపెట్టి ఈరోజు ఎర్రటి సంచిలో బడ్జెట్ పత్రాలను పార్లమెంటుకు నిర్మలా సీతారామన్ తీసుకొచ్చారు. ఆ సంచిపై భారత అధికార చిహ్నమైన మూడు సింహాలు ఉన్నాయి. దీనిపై ఆమె వివరణ ఇచ్చారు. బ్రిటీష్ హ్యాంగోవర్ నుంచి బయటకు రావడానికి ఇదే సరైన సమయమని ఆమె తెలిపారు. అంతేకాదు మోయడానికి కూడా సులభంగా ఉంటుందని చమత్కరించారు. బడ్జెట్ పత్రాలను తీసుకురావడానికి లెదర్ సూట్ కేసునే నేను ఎందుకు వాడాలని ఆమె ప్రశ్నించారు. మన సాంప్రదాయాల వైపు కదులుదామని అమె అన్నారు.





