News

ఆలయాల విశిష్టత తెలిపేదే ఆలయవేదం

624views

దేవాలయాలకు వెళ్లిన సమయంలో నిర్మా ణాలు, శిల్పాలను అధ్యయనం చేయడం అల వాటు చేసుకోవాలని భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతీ స్వామి సూచించారు. పుస్తక మహోత్సవంలో భాగంగా మంగళవారం కేతు విశ్వనాథరెడ్డి సాహిత్య వేదికపై కందుకూరి వెంకట సత్యబ్రహ్మాచార్య రచించిన ‘ఆలయ వేదం’ గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగంలో భాగంగా మన ప్రాచీన శాస్త్రాల ప్రకారం నిర్మించిన ఆలయాలు, చెక్కిన శిల్పాలు సూక్ష్మమైన, సునిశితమైన విశిష్టతలను కలిగి వుంటాయని వివరించారు. దేవాలయాలకు వెళ్లినప్పుడు తొందర తొందరగా దైవదర్శనం చేసుకొని వచ్చేయడం కాకుండా దేవాలయ నిర్మాణ విశేషాలను తెలుసుకొనేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. ప్రాచీన శాస్త్రాల మేరకు నిర్మించిన ఆలయాలు, చెక్కిన శిల్పాలు, సూక్ష్మమైన, సునిశితమైన విశిష్టతలు కలిగి ఉంటా యని ఆయన పేర్కొన్నారు.

దేవాలయాలకు వెళ్లి త్వరగా దైవదర్శనం చేసుకొని రావడం కంటే నిర్మాణ విశేషాలు తెలుసుకునేందుకు సమయం కేటాయించాలని సూచించారు. దేవాలయ శిల్పానికి సంబంధించి వివిధ భాషల్లో ఉన్న గ్రంథా లను తెలుగులోకి అందుబాటులోకి తీసుకొచ్చేం దుకు కృషి చేస్తున్న సత్య బ్రహ్మాచార్యను అభినం దించారు. ఇక్కడే శైవాగమానికి చెందిన ‘శివ ధర్మ శాస్త్రం’ తెలుగు అనువాదాన్ని శ్రీశైల దేవ స్థానం ఆస్థాన దైవజ్ఞులు బుట్టి వీరభద్ర సిద్ధాంతి ఆవిష్కరించారు. పుస్తకాన్ని డాక్టర్ అంబడిపూడి నాగభూషణం తెలుగులోకి అనువదించి సంపాద కత్వం వహించారు. డాక్టర్ కప్పగంతు రామకృష్ణ సభ నిర్వహించగా, గోవర్ధనశాస్త్రి, భవిరి రవి ధ్వన్యనుకరణ చేశారు