
ఇరాక్ పరిశోధకులు మాత్రం ఇది ఓ కొండజాతి రాజు చిత్రమని పేర్కొంటున్నారు. రాజులు ఎదుట మోకాలిపై ఉన్నవారిని ఖైదీలుగా భావిస్తామని వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ శిలపై చిత్రంలో కనిపిస్తోన్న రాజు, వానరాలను రాముడు, హనుమంతుడి అనే విషయం గుర్తుచేస్తుందన్నారు. ఇరాక్ చరిత్రకారులు, పురాతత్వశాస్త్రవేత్తలు మాత్రం దీనికి రాముడితో సంబంధం లేదని అంటున్నారు.. ఏదేమైనా ఇరాక్ ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన తర్వాత దీనికి గల సంబంధాన్ని అన్వేషిస్తామని అన్నారు. సింధూ లోయ, మొసపటోమియా నాగరికతల మధ్య సంబంధాలకు ఇది తొలి అధికారిక ప్రయత్నమని సింగ్ స్పష్టం చేశారు. క్రీస్తుపూర్వం 4500 నుంచి 1900 మధ్య మొసపటోమియాను పాలించిన సుమేరియన్ల మూలాలు సింధూ లోయ నాగరికతతో ముడిపడి ఉన్నాయనడానికి పలు ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఇక, యూపీ సాంస్కృతిక శాఖ సైతం ఇలాంటి విగ్రహాన్ని రూపొందించి, అయోధ్యలో ప్రతిష్ఠించే యోచనలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాముడి ప్రతిమ, చిత్రాలను అయోధ్యలో ఒకే చోట ఉంచాలని భావిస్తోంది.
Source : Samayam Telugu.
https://vskandhra.org/wp-admin/post.php?post=4545&action=edit





