
ఆదివారం ఉదయం ఉత్తర ప్రదేశ్ మీర్జాపూర్లోని ఆహ్రౌరా ప్రాంతంలో ఉన్న భండారీ దేవి దేవాలయ దర్శనానికి వెళ్తున్న ఒక స్థానిక హిందూ యువకుణ్ణి డజనుకు పైగా ఉన్న స్థానిక ముస్లిం యువకులు అడ్డుకుని చితకబాదడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం ఉదయం ఘటన జరిగిన వెంటనే వేలాది హిందువులు రోడ్లపైకి వచ్చి సాయంత్రం వరకు ఆందోళన చేపట్టారు. సాయంత్రానికి ఎట్టకేలకు పోలీసులు నిందితులలో ముగ్గురిని అరెస్టు చెయ్యడంతో ఉద్రిక్తతలు కొంత సద్దుమణిగాయి.
ఉదయం 11 గంటల నుంచి మొదలైన వేలాది హిందువుల ఆందోళనల నేపధ్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఇంచర్గే అమిత్ కుమార్ సింగ్ ఇచ్చిన హామీ మేరకు పోలీసులు త్వరిత గతిన జరిగిన ఘటనలో ప్రధాన నిందితుడు సునవ్వర్ అలీ తోపాటుగా సోను, వహీద్ అనే యువకులను అరెస్టు చేశారు.
నిందితులను కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆ ముగ్గురికీ 14 రోజుల రిమాండు విధించింది. వారు ఆ ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారని పేర్కొంటూ వారికి బెయిల్ ను కూడా కోర్టు తిరస్కరించడం గమనార్హం.





