News

పన్నెండేళ్ళ బాలికపై అత్యాచారం. ఇస్లామిక్ మత బోధకుడి నిర్వాకం

872views

12 ఏళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడిన మదరసా (ఇస్లామిక్ పాఠశాల) ఉపాధ్యాయుడిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

మీరట్ సమీపంలోని ఖేరి కలాన్ గ్రామంలోని మదరసాలో ఈ ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు, ఇస్లామిక్ మత బోధకుడు మౌలానా జావేద్ ను అరెస్ట్ చేశారు.

అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు జావేద్ కు స్థానిక కోర్టు రిమాండు విధించింది. జావేద్ పై ఇప్పటికే పోస్కో చట్టం క్రింద కేసు నమోదు కాగా, జాతీయ భద్రతా చట్టానికి సంబంధించిన సెక్షన్లు కూడా నమోదయ్యే అవకాశం ఉందని సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ అనంత్ దేవ్ సూచనప్రాయంగా వెల్లడించారు. వైద్య రిపోర్టులు అందగానే చార్జిషీటు దాఖలు చేస్తామని తెలిపారు. నిందితుడి దుస్తులను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు.