
332views
శిలలపై శిల్పాలు చెక్కినారు.. మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు.. అన్న ఆత్రేయ కలం నుంచి జాలువారిన గీతాన్ని నిజం చేస్తూ అమెరికాలోని మన వాళ్లు అత్యద్భుత శివాలయాన్ని నిర్మించారు. విద్యుత్తును, పవర్ టూల్స్‌ను వాడకుండా కేవలం చేతులతో చెక్కిన శిలలతో ఈ ఆలయానికి రూపమిచ్చారు. హవాయ్‌లోని కాయి ద్వీపంలో తెల్ల గ్రానైట్ శిలలతో బంగారు వర్ణ డోమ్‌లతో ఆలయాన్ని నిర్మించారు.
హవాయ్‌లో ఉన్న 14 లక్షల మంది జనాభాలో కేవలం 1 శాతమే హిందువులుంటారు. ఆలయాన్ని నిర్మించిన కాయిలో కేవలం 50 మందే హిందువులున్నారు. అయినా వారు మొక్కవోని దీక్షతో ఆలయాన్ని నిర్మించి కలను సాకారం చేసుకున్నారు.




