News

శ్రీవారి భక్తులకు శుభవార్త – ఫిబ్రవరి టికెట్ల బుకింగ్స్‌ – ఎప్పుడో తెలుసా?

366views

తిరుమలలో 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిజత సేవలు, వసతి గదుల కోటా, రూ.300 టికెట్లను టీటీడీ విడుదల చేస్తోంది. ఏయే తేదీల్లో ఈ టికెట్లను విడుదల చేయనుందో ప్రకటించింది.

ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి అంగప్రదక్షిణం టికెట్లను ఈ నెల 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్‌ అండ్ అకామడేషన్‌ టికెట్లను ఈ నెల 11 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. వృద్ధులు, దివ్యాంగుల టికెట్లను 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారు. రూ.300 దర్శన టికెట్ల కోటాను 24వ తేదీన ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది. తిరుపతిలో భక్తులు వసతి గదులను బుక్‌ చేసుకోవాడానికి కోటాను 25వ తేదీన రిలీజ్‌ చేస్తామని, అదేవిధంగా.. తిరుమలలో గదుల బుకింగ్‌ కోటాను 26వ తేదీన విడుదల చేస్తామని టీటీడీ తెలియజేసింది.

అదేవిదంగా.. వర్చువల్ విధానంలో నిర్వహించే.. స్వామివారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలకు సంబంధించిన టికెట్లను ఈ నెల 21వ తేదీన ఇప్పటికే విడుదల చేసింది.